గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి సంచలన లేఖ రాశారు. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హయాంలో జరిగిన పలు అవకతవకలు, కీలక కేసుల దర్యాప్తు తీరుపై సీబీఐ విచారణ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలని రాజాసింగ్ సీఎంను విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాటి సీపీ సజ్జనార్ ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేశారా? లేదా? అనే దానిపై పారదర్శక విచారణ అవసరమన్నారు. హామ్ వే కేసులోనూ సజ్జనార్ వ్యవహారశైలిపై మరిన్ని అనుమానాలు బలపడ్డాయని పేర్కొన్నారు.