మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు. హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన కుమారుడు హిమాన్షుతో కలిసి హాజరయ్యారు. ముగ్గురు ముఖ్య నేతలు ఒకే చోట కనిపించడంతో కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్, హిమాన్షు హరీశ్‌రావు కుమారుడితో సరదాగా మాట్లాడుతున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.