ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే వస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడి వస్తారని రాంచందర్‌రావు విమర్శించారు. ఈసారి మాత్రం ప్రపంచ దేశాల నుంచి వ్యాపారులను హైదరాబాద్‌కే రప్పించి ఇక్కడే వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు పెట్టుబడులను తీసుకువచ్చేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే భారత వ్యతిరేక గళాలను ఆహ్వానించే అవకాశం ఉండటంతోనే ఈ సమిట్‌ను బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు.