రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ లో ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమవుతున్నారు. బీబీసీ బంగ్లా నివేదిక ప్రకారం షేక్ హసీనాను న్యూఢిల్లీ నుంచి తిరిగి తీసుకురావడానికి బంగ్లాదేశ్ ఒక సైనిక విమానాన్ని పంపాలని, అలాగే ఆమెకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునేందుకు, 2024 అణచివేతపై కొత్తగా విచారణ ఎదుర్కొనేందుకు అవకాశం కల్పిస్తామని,బంగ్లా సరిహద్దుల్లో సైన్యం అధికార లాంఛనాలతో
హసీనాను తీసుకెళ్లాలన భారత్ హామీ కోరినట్లు సమాచారం.