అంతర్యామి అలసతి, సొలసితి. అంతట నీ శరనే జొచ్చితినీ…అంతర్యామి..అంటూ ఇప్పుడో పోస్టర్ ఏపీ వ్యాప్తంగా తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడీ పోస్టర్ తీవ్ర వివాదాస్పదమైంది. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్రానికి బదులుగా, స్వామివారి రూపంలో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి ముఖాన్ని మార్ఫింగ్ చేసిన పోస్టర్‌ను బొమ్మిశెట్టి చంద్ర పోస్ట్ చేశారు. ఈపోస్ట్పై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని అవమానించారంటూ పోస్ట్‌ను వెంటనే తొలగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలకు దిగాయి.