శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సీటీఓ) కృష్ణవేణి రూ.10 వేల లంచం తీసుకుంటున్న దృశ్యాలను ఓ చిరు వ్యాపారి తన సెల్ఫోన్లో చిత్రీకరించారు. కృష్ణవేణి ఒక్కో వ్యాపారి నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సీటీఓకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ అండదండలు ఉన్నాయని, ఆ కారణంగానే ఆమె బాహాటంగా వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు.