చంద్రబాబు గారూ.. చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా? ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఉరితాడు బిగించారని, ఇది ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణం మీదకు వస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

