మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం భారత్‌లోని పలు విమానయాన సంస్థలపైనా పడింది. ఢిల్లీ నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశామని స్పెస్‌జెట్ ఎక్స్‌లో తెలిపింది. ఢిల్లీ నుంచి పుణె, లేహ్, ముంబైకి వెళ్లాల్సిన సర్వీసులను క్యాన్సిల్ చేశామని తెలిపింది. అలాగే ఢిల్లీ ఎయిర్‌పోర్టు కూడా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యల కారణంగా కొన్ని ఫ్లైట్ల సర్వీసులపై ప్రభావం పడింది. లేటెస్ట్ అప్డేట్ల కోసం ప్రయాణికులు స్పైస్‌జెట్‌ను సంప్రదించవచ్చు’ అని పేర్కొంది.