దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం, నవంబర్ 15 నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని ఇది కచ్చితంగా తుపానుగా మారుతుందా లేదా, ఏ తీరాన్ని దాటుతుంది, దీని తీవ్రత ఎంత ఉంటుంది అనే విషయాలపై ఇప్పుడే పూర్తి స్పష్టత లేదు. కాబట్టి ప్రస్తుతానికి దీన్ని కేవలం అల్పపీడన వ్యవస్థగానే పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.

