తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియగా సాగుతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు తమ ప్రభుత్వ నెత్తిన పెట్టి పోయినా, ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితులు వచ్చినా స్కీం ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేద లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు. ఇందిరమ్మ టవర్స్ లబ్దిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించారు.

