టాలీవుడ్ నటి, తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ చేయించుకున్నానని, ఆపరేషన్ విజయవంతమై ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు సంబంధించిన వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. తన అనుభవం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.