కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని 1984 సిక్కు అల్లర్లలో మరణించినవారి కుటుంబ సభ్యులు కాల్చేసి తమ నిరసన తెలియజేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అల్లర్లపై సోనియా గాంధీ పూర్తిగా అబద్దాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అల్లర్లను కంట్రోల్ చేయాలని ఆర్మీని నవంబర్ ఒకటో తేదీనే ఆదేశించినా.. నవంబర్ రెండో తేదీ సాయంత్రం నాటికే సైన్యం ఢిల్లీ చేరుకుందని రాశారని తెలిపారు.