సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ‘ఉత్తరాంధ్ర టైగర్’, ‘మన్యం పులి’గా అభిమానుల చేత పిలువబడే ఆయన 1978లో నాగూరు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా,కాంగ్రెస్ పార్టీలో 1983, 1985 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించారు. పర్యావరణ శాఖల మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

