ఆంధ్రప్రదేశ్‌ను కేవలం దేశానికి అన్నపూర్ణగా, రైస్ బౌల్‌గా మాత్రమే చూడకూడదని.. రాష్ట్రం ఇప్పుడు ఫ్రూట్ బౌల్, సీఫుడ్ హబ్ గా కూడా వేగంగా ఎదుగుతోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. సంప్రదాయ వ్యవసాయ రంగానికి అదనంగా పండ్ల ఉత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ రాష్ట్రం తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని తెలిపారు. CII Summitలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పెట్టుబడులు, సాంకేతికత, పరిశ్రమల విస్తరణతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కీలక పారిశ్రామిక, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన సందేశమిచ్చారు.