భారత్ లో అత్యంత పరిశుభ్రమైన నగరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వార్షిక స్వచ్ఛతా సర్వేలో నవీ ముంబై ఇండియాలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. సూరత్, విజయవాడ నగరాలు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రేవా అత్యంత పరిశుభ్రమైన నదీతీర పట్టణంగా, ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ అత్యంత పరిశుభ్రమైన హిమాలయ నగరంగా ఎంపికయ్యాయి.