విశాఖపట్నంలోని AU కళాశాల గ్రౌండ్స్‌లో ఈ నెల 12, 13 తేదీల్లో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సు కోసం విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. గిరిజన థింసా డాన్స్, గరగ నృత్యం, తప్పెట గుళ్లు వంటి జానపద సంప్రదాయ ప్రదర్శన, తోలుబొమ్మలాట, కూచిపూడి కళలను ప్రతిబింబించేలా సదస్సు ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.