గ్రూప్-2 పూర్తిస్థాయి నోటిఫికేషను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పోస్టులను 686 నుంచి 720కి పెంచింది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులు ఇవాల్టి నుంచి డిసెంబర్ 11 రాత్రి 11:59 వరకు సమర్పించవచ్చు. ఫిబ్రవరి 21న ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. ఎగ్జిక్యూటివ్ విభాగంలో 203 డిప్యూటీ తహసీల్దార్, 176 డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు కమిషన్ అధికారిక https://portal-psc.ap.gov.in లో OTPR ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.