దీపావళి బాణసంచా కారణంగా హైదరాబాద్లోని మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ కట్టారు. 32 మంది కంటి గాయాలతో రాగా.. వీరిలో ఆరుగురిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు ఉన్నారు. ఒకరు కుడి కంటిచూపును పూర్తిగా కోల్పోయారు. పండుగ వేళ మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తూ.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.