సౌదీ అరేబియాలోని ఆ ప్రాంతాలపై శనివారం దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించారు. తమ లక్ష్యాలలో రియాద్ ఎయిర్ పోర్టు, ఆరామ్ కో చమురు క్షేత్రాలు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలు ఉన్నట్లు హూతీల సైనిక ప్రతినిధి యాహ్యా సరీ వెల్లడించారు. యెమెన్ లోని తైజ్ ప్రావిన్స్ లోని ఓ మార్కెట్ పై సౌదీ చేసిన దాడులకు ప్రతీకారంగా బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు, నేషనల్ గార్డ్ శిబిరంపై దాడులలో అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది’ అని యాహ్యా సరీ పేర్కొన్నారు.