గ్యాంగ్స్టర్ గుర్వీందర్ అలియాస్ అఫ్రిదీని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 10 నెలల పాటు గాలింపు చర్యలు చేపట్టగా.. అతడు ఇథియోపియాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం భారతదేశానికి తీసుకొచ్చారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవగానే పంజాబ్ పోలీసుల బృందం అతడిని తమ అధీనంలోకి తీసుకుంది. విదేశాల్లో ఉంటూ పంజాబ్లో హత్యలు, బెదిరింపులు, వసూళ్లతో పాటు కాల్పులకు పాల్పడటం వంటి నేర కార్యకలాపాలను అఫ్రిదీ నడిపిస్తున్నట్లు ఆరోపించారు.