దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులు రేవంత్ రెడ్డికి సామాజిక మాధ్యమం ‘ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. “తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.