బీజేపీ సీనియర్ నేత, భారత రత్న లాల్‌కృష్ణ అద్వాణీకి ఆయన 99వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. “శ్రీ ఎల్కే అడ్వాణీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారత్ రత్న పురస్కారం అందుకున్న తర్వాత వస్తున్న పుట్టినరోజు కావడం వల్ల ఈ సంవత్సరం మరింత ప్రత్యేకమైనది. భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన దిగ్గజ నాయకుల్లో ఆయన ఒకరు. ఇన్ని సంవత్సరాలుగా ఆయన మార్గదర్శకత్వం పొందడం నా అదృష్టం” అని పేర్కొన్నారు.