ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాల పరిధిపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రైమరీ క్రైమ్ లేకుండా ఈడీ స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టి డబ్బు అక్రమ చలామణి కేసులను నమోదు చేయలేదని స్పష్టం చేసింది. తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని దర్యాప్తు చేయడానికి ఈడీ ఏమీ “సూపర్ కాప్” కాదని వ్యాఖ్యానించింది. షెడ్యూల్డ్ నేరంపై ఎఫ్ఐఆర్ లేదా అధికారిక ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత మాత్రమే ఈడీ రంగంలోకి దిగడానికి వీలుంటుందని కోర్టు పేర్కొంది.