విజయనగరం జిల్లా జడ్పీ ఎన్నికల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు షాక్ తగిలింది. ఆయన కుమార్తె బొత్స అనూష బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో ఓటమి చెందారు. బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో బొత్స అనూషపై టీడీపీ అభ్యర్థి పాశల నీరజ ఘనవిజయం సాధించారు. కూటమి అభ్యర్థి పాశల నీరజ తన సమీప ప్రత్యర్థి అనూషపై 5,136 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడంతో బొండపల్లిలో కూటమి నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.