కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్టు వ్యయం రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు పెరిగిందని వివరించారు. 2014లో సుమారు రూ.1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.6,825 కోట్లకు చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. అంటే దాదాపు ఐదు రెట్లు వ్యయం పెరిగిందని, ప్రజాధనాన్ని ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అందలేదని కెటిఆర్ ఆరోపించారు.