తెలంగాణ వస్తే పాలమూరు జిల్లా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని కెసిఆర్‌పై విమర్శలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ హయాంలోనే నిర్మించారని, అదే పాలనలో ప్రాజెక్టు కుప్పకూలిందని ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉంటే తెలంగాణలోనే కరువు వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు తన పేరును ‘కాళేశ్వరరావు’గా చెప్పుకునేలా అప్పట్లో ప్రచారం చేసుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.