పెనుమంట్రలో ఒక్క ఓటుతో టీడీపీ అభ్యర్థి గెలుపు :పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి జెడ్పీటీసీ స్థానంలో అత్యంత ఉత్కంఠభరిత పోరు సాగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణ కుమారి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. స్వల్ప తేడాతో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ శ్రేణులు రీకౌంటింగ్ కోరగా, అధికారులు నిబంధనల ప్రకారం మళ్లీ ఓట్లను లెక్కించారు. అయితే రీకౌంటింగ్‌లోనూ అరుణ కుమారికే ఆ ఒక్క ఓటు ఆధిక్యం రావడంతో అధికారులు ఆమె గెలుపును అధికారికంగా ఖరారు చేశారు.