భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. కెఎల్ రాహుల్ చివర వరకు ఆడి భారత్‌ను గెలిపించారు. కివీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోవడంతో డక్ వర్త్ లూయిస్(DLS )పద్ధతిలో భారత్ గెలుపొందింది.కెఎల్ రాహుల్(26), శ్రేయస్ అయ్యర్(30), రోహిత్ శర్మ(23) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.విరాట్ కోహ్లీ ఏడు పరుగులు,శుభ్‌మన్ గిల్ ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ రూపంలో వెనుదిరిగారు.