నగరి కౌంటింగ్ సెంటర్ దగ్గర మాజీ మంత్రి రోజా ఆందోళనకు దిగారు. విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అయితే, వైఎస్సార్సీపీ గెలిచినా.. టీడీపీ గెలిచిందంటూ అధికారులు ప్రకటించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిని పోలీసులు బయటకు నెట్టేశారు. పోలీసులు, అధికారుల తీరుకు నిరసనగా.. కౌంటింగ్ కేంద్రం ముందు రోజా బైఠాయించారు. నిరసనకు దిగిన రోజాను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.