ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించే దిశగా వార్షిక పరీక్షల మధ్య వ్యవధి పెంచాలని సర్కారు ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పద్ధతిలో ఒక టైమ్ టేబుల్, ఒక్కో పరీక్షకు 2 రోజుల వ్యవధితో మరో షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ ప్రతిపాదించింది. దీనివల్ల పాఠ్యాంశాల పునశ్చరణకు సమయం లభిస్తుందని, విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాస్తారని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. వ్యవధి ఉండే టైమ్ టేబుల్‌కు ఆమోదం లభించవచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.