భక్తుల వస్త్రధారణపై సింహాచలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడే ఉద్దేశంతో భక్తులందరికీ సాంప్రదాయ దుస్తుల నియమావళిని అమలు చేయాలని నిర్ణయించింది. స్వామివారి దర్శనానికి వచ్చే పురుష భక్తులు ధోతీ, అంగవస్త్రం లేదా కుర్తా పైజామా ధరించవచ్చు. సంప్రదాయబద్ధమైన ఫార్మల్ షర్ట్, ప్యాంట్తోనూ సాధారణ దర్శనానికి అనుమతి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. మహిళా భక్తులు చీర, లంగావోణీ లేదా దుపట్టా తప్పనిసరిగా ఉన్న చుడీదార్ ధరించి రావాల్సి ఉంటుంది.