దీపావళి వేడుకలతో పాటు కాలుష్యంపై మరింత అవగాహన పెంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కేవలం ఆంక్షలు విధించడం వల్లే సమస్య పరిష్కారం కాదని పేర్కొంది. దీపావళి సమయంలో పెరుగుతున్న కాలుష్యంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువరించింది. దిల్లీలో వాయు కాలుష్యంపై సుమోటోగా విచారణ జరుపుతున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, పండుగల సమయంలో పాటించాల్సిన ఆచారాలు, పద్ధతులను పరిశీలించాలని సూచించింది. కాలుష్య సంక్షోభానికి ఆర్థికంగా వెనకబడిన వర్గాలను నిందించవద్దని సీజేఐ హెచ్చరించారు.