యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేశారు. ఇందులో 2526 మంది ఇంటర్వూలకు అర్హత సాధించారు. ఇవాళ విడుదలైన యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలను తెలుసుకునేందుకు ముందుగా అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in సందర్శించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన వారికి సంబంధించిన ఈ-సమన్ లెటర్లు యూపీఎస్సీ వెబ్సైట్, ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు తుది ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోపు అభ్యర్థులందరి మార్కు షీట్లు కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు.