చెరువులో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిద్ర లేని రాత్రి గడిపామన్నారు. రాత్రి మా దగ్గర లైట్లు ఉండటంతో వారికి సిగ్నల్స్ ఇచ్చాం. దాదాపు కిలోమీటరు కంటే ఎక్కువగానే కొట్టుకుపోయాం, వరద ఉధృతి పెరిగిన క్రమంలో బోటు పల్టీ కొట్టక ముందే నేను, నా మిత్రుడు దూకేశాం.ఆ నీటి ప్రవాహంలోనే కిలో మీటరు వరకు కొట్టుకెళ్లాం. అక్కడ ఉన్న చెట్లను పట్టుకుని ఉన్నాం. ఉదయం మా కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి రెస్క్యూ చేసింది. దీంతో ప్రాణాలతో బయటపడగలిగాం చెబుతున్నారు.

