ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 37.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.