కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఇండి కూటమి నేతలు ప్రజా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పించే వరకు తమ పోరాటం ఆగదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ‘సర్’లో జరిగిన అవకతవకల వెనుక జ్ఞానేశ్ కుమార్ ఒక్కరే కాదని, ఇంకా చాలామంది ఉన్నారని ఆరోపించారు.