ఉష్ణోగ్రతల వైపరీత్యం, వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో అక్టోబరు నెలలో వేసవి కాలాన్ని తలపించేలా పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. అర్బన్ ప్రాంతాల లోడ్, రూరల్ వ్యవసాయ విద్యుత్ సరఫరా ఒకే సారి పీక్ రికార్డును తాకడంతో పవర్ డిస్కమ్‌లు, విద్యుత్ గ్రిడ్ యాజమాన్యం సరఫరా పంపిణీ వ్యవస్థను నిర్వహించడంలో సవాలును ఎదుర్కొంటున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.