రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో శుక్రవారం రాత్రి స్థానిక కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఫెస్టివల్ జరిగింది. ఈ ఫెస్టివల్ అనంతరం పలువురు విద్యార్థులు కాలేజీ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అటు వైపు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ఆ విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో రైతు రాజిరెడ్డి పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మోహన్‌తోపాటు మరో విద్యార్థి మృతి చెందినట్లు గుర్తించారు.