హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలు అయిన శంషాబాద్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, నానక్‌రామ్‌గూడ, షేక్‌పేట్, మణికొండ, టోలీచౌకిల్లో భారీ వర్షపాతం నమోదైంది. అలాగే కాప్రా, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్, కీసర, నాగారం, చర్లపల్లి ఏరియాల్లో కూడా రహదారులు జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే పడటంతో ఐటీ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం ధాటికి రోడ్డుపైన నీరు చేరడంతో సిటీలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

