ఉత్తరాఖండ్ చమోలి జిల్లా జోషీమఠ్ సమీపంలో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న ఆరుగురూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పైలట్ తో పాటు ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ట్రాన్స్ భారత్ ఏవియేషన్ హెలీకాప్టర్ బద్రీనాథ్ నుంచి ఫటాకు వెళ్తుండగా జోషీమఠ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. పైలట్ హిమాన్షు ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా, ఐదుగురు ప్రయాణికులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో అరుణ్, ప్రతాప, శంకర్ గౌడ, సుధీర్, నటరాజలు ఉన్నట్లు తెలిపారు.

