ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన శివకార్తీక్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని స్దానిక సంస్థల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు సమర్పించిన నామినేషన్లను, అఫిడవిట్లను ఆన్ లైన్ లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎస్ఈసీ వివరణ కోరింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. నామినేషన్లు, అఫిడవిట్లు వెబ్ సైట్లో ఉంచేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది.