రాష్ట్రంలో ఎప్పటిలాగే పెన్షన్ల పంపిణీకి కొన్ని షరతులు పెట్టింది. పెన్షన్లను ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయాలని షరతు పెట్టింది. కొత్తగా ఎవరినీ పింఛన్ లబ్ధిదారుల జాబితాలో చేర్చడానికి అనుమతి లేదని ఎస్ఈసీ తెలిపింది. అలాగే పింఛన్ మొత్తాల్లోనూ ఎలాంటి మార్పులు చేయరాదని సూచించింది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే వినియోగించచుకోవాలని, రాజకీయ నేతలు ఇందులో పాల్గొనరాదని ఎస్ఈసీ తెలిపింది. తమ ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తీసుంటామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.