వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, అక్టోబర్ 30 నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మరింత జోరందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నేడు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వానలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. రాత్రి సమయాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.