హైదరాబాద్‌లోని మల్లారెడ్డి డీమ్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సెలవు ప్రకటించి సినిమా ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించడంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సదరు యాజమాన్యానికి త్వరలోనే నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నట్లు స్పష్టం చేసింది. కళాశాల తరగతులను రద్దు చేసి వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఎస్ఎఫ్ఐ (SFI) రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ బృందం గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించింది.