ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన గర్భధారణ (ప్రెగ్నెన్సీ) చివరి దశను ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమె, ‘#9. ది ఫైనల్ ల్యాప్’ అనే క్యాప్షన్‌తో ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు వేర్వేరు దశల్లో ఆమె చేసిన వ్యాయామాలను చూపించారు. ఆమె తొమ్మిదో నెల గర్భంతో ఛాతీకి దగ్గరగా డంబెల్ పట్టుకుని వెయిటెడ్ స్క్వాట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.