కడప నగరపాలక ఉన్నత ప్రధాన పాఠశాలలో గురువారం ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డు, ఎన్నికల ఆర్డర్ కాపీ ఉన్న ఉద్యోగులను మాత్రమే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాగే ఈ ప్రక్రియ ద్వారా నగరవ్యాప్తంగా సుమారు 2,500 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.