సీఎం చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సమావేశంలో సుమారు 48 కీలక ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సుమారు రూ. 35,000 కోట్ల మేర పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే పలు పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలను ఇందులో పొందుపరిచారు.