ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాలనలో మార్పు కోరుతూ జరిగే నిరసనల్లో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతో అభ్యర్థుల క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది. శాంతియుత నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో మాత్రమే అభ్యర్థులకు ఉద్యోగాలను నిరాకరించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయిన సందర్భాల్లోనే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.