పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే అని.. ఇందులో రెండో ఆలోచనకు ఆస్కారం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘అభ్యర్థిని కాదు.. ఎన్డీఏను చూసి ఓటు వేయాలి’ అని అన్నారు. పార్టీ తరఫున ఎక్కడైనా రెబల్స్ ఉంటే వెంటనే వాళ్లను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వాళ్లు పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టే భావించాలన్నారు. మంత్రులు తమ నియోజకవర్గాలతో పాటు ఇన్ఛార్జ్లుగా ఉన్న జిల్లాలపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు.