నవంబర్ 1న ఇండీ కూటమి తలపెట్టిన చలో దిల్లీ ర్యాలీలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పోలీసులు, లాఠీలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. తమ కుతంత్రాలను ప్రయోగించే దమ్ము బీజేపీకి లేదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి, దేశాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా నడుద్దామని రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలన్నీ ఈ మార్చ్‌లో పాల్గొనాలని కోరారు.